ETV Bharat / state

కుళ్లిన మాంసం, చేపలు.. హోటల్​ యజమానికి రూ.10 వేలు ఫైన్ - తనిఖీల్లో పట్టుబడిన కుళ్లిన మాంసం

ఆదాయం కోసం హోటల్​ నిర్వాహకులు ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. కుళ్లిన మాంసం, చేపలతో ఆహారం తయారు చేస్తున్నారు. వనపర్తి జిల్లా ఆత్మకూరులో పురపాలిక కమిషనర్​ ఆకస్మిక తనిఖీల్లో ఈ బాగోతం బయటపడింది. దీంతో ఆ హోటల్​ నిర్వాహకునికి అధికారులు రూ.10 వేల జరిమానా విధించారు

artmakur municipal commissioner unexpected ride on hotels in wanaparthy district
ఆత్మకూరులోని ఓ హోటల్​ తనిఖీల్లో కుళ్లిన మాంసం
author img

By

Published : Feb 10, 2021, 5:27 PM IST

కుళ్లిన మాంసం, చేపలు విక్రయిస్తున్న హోటల్ యజమానికి రూ.10 వేలు జరిమానా విధించారు. వనపర్తి జిల్లా ఆత్మకూరులో మున్సిపల్ కమిషనర్ రమేశ్​ నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో ఈ సంఘటన వెలుగుచూసింది. పట్టణ కేంద్రంలోని దాబాలు, హోటళ్లలో పురపాలక సిబ్బందితో కలిసి ఆయన సోదాలు నిర్వహించారు.

ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా అందరికీ నోటీసులు జారీ చేశారు. మాంసం విక్రయదారులు మార్కెట్​లో ఆరోగ్యంగా ఉన్న జీవాలను మాత్రమే వధించాలని హెచ్చరించారు. లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. తూనికల విషయంలో కచ్చితమైన నియమ నిబంధనలు పాటించాలని రమేశ్​ సూచించారు.

ఇదీ చూడండి : ప్రజాస్వామ్య విలువలు కాపాడుకోవాలి: రాఘవులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.