వనపర్తి జిల్లా మదనాపురం మార్కెట్ యార్డ్‌లో నూతనంగా ఏర్పాటైన పాలకవర్గం ప్రమాణ స్వీకారానికి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రైతులు పండించిన పంటను ఎక్కడికక్కడే విక్రయించుకునేందుకు ప్రభుత్వం నిర్మిస్తున్న ఆధునిక మార్కెట్ యార్డ్ సముదాయాలను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు.
మార్కెట్ యార్డ్‌లో ఎలాంటి సమస్యలను రానివ్వకుండా రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, జిల్లా పరిషత్ ఛైర్మన్ లోకనాథ్ రెడ్డి పాల్గొన్నారు.
ఇదీ చూడండి: డ్రైవర్‌కు కరోనా... హోం క్వారంటైన్లో జీహెచ్ఎంసీ మేయర్ కుటుంబం