ఆరో విడత హరితహారంలో భాగంగా వనపర్తి జిల్లాలోని నాగవరం, రాజపేట ప్రాంతాల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మొక్కలు నాటారు. జిల్లా పరిధిలో 47 లక్షల 63 వేల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు తయారు చేసినట్లు వెల్లడించారు. ఇప్పటివరకు 20 లక్షల మొక్కలు నాటినట్లు తెలిపారు.
ప్రకృతిలో పచ్చదనం పెంపొందించాలని, పర్యావరణాన్ని కాపాడటానికి ప్రతి ఒక్కరు తప్పకుండా చెట్లు నాటాలని మంత్రి సూచించారు. గ్రామ పంచాయతీలకు పంపిణీ చేసిన ట్రాక్టర్ల ద్వారా వేసవి కాలంలో మొక్కలు ఎండిపోకుండా నీరు సరఫరా చేసినట్లు తెలిపారు. ప్రతిఒక్కరూ హరితహారం కార్యక్రమంపై దృష్టి సారించి హరిత తెలంగాణ సాధించేందుకు కృషి చేయాలన్నారు.