ETV Bharat / state

ప్రతి రైతు ఖాతాలో రైతుబంధు సాయం: నిరంజన్ రెడ్డి

author img

By

Published : Jan 11, 2021, 5:25 PM IST

పట్టాదారు పాసు పుస్తకం కలిగి బ్యాంకు ఖాతాలతో వివరాలు నమోదు చేయించుకున్న ప్రతి రైతు ఖాతాలో రైతు బంధు సాయం జమ చేశామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. రైతుబంధు కింద 2018 వానాకాలం నుంచి ఇప్పటివరకు ఆరు విడతల్లో రూ. 35,660.65 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని ప్రకటించారు.

ప్రతి రైతు ఖాతాలో రైతుబంధు సాయం: నిరంజన్ రెడ్డి
ప్రతి రైతు ఖాతాలో రైతుబంధు సాయం: నిరంజన్ రెడ్డి

అన్నదాతకు రైతుబంధు పథకం ద్వారా ‘ఆసరా’ లభించిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. రైతుబంధు కింద 2018 వానాకాలం నుంచి ఇప్పటివరకు ఆరు విడతల్లో రూ. 35,660.65 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని ప్రకటించారు. మొదటి విడతలో చెక్కులు, ఆ తరువాత నేరుగా రైతు బ్యాంకుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు.

మొదటి రెండు విడతల్లో ఎకరానికి రూ. 4 వేల చొప్పున, మిగతా 4 విడతల్లో ఎకరానికి రూ. 5 వేల చొప్పున రైతులకు పంపిణీ చేశామని చెప్పారు. మూడేళ్లల్లో ఎకరానికి రూ. 28 వేల నగదు బదిలీ చేసినట్లు స్పష్టం చేశారు. ఈ ఏడాది వానాకాలం, యాసంగి కలిపి మొత్తం రూ. 14,640.44 కోట్లు పంపిణీ చేయగా... తాజా యాసంగిలో 59.16 లక్షల మంది రైతులకు రూ. 7351.74 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు.

ప్రతి ఒక్క రైతుకు...

2018-19లో 50.25 లక్షల మంది రైతులకు రూ. 10,488.19 కోట్లు, 2019-20లో 51.61 లక్షల మంది రైతులకు రూ. 10,532.02 కోట్ల సాయం, 2020 వానా కాలంలో 58.02 లక్షల మంది రైతులకు రూ. 7288.70 కోట్లు రైతుబంధు కింద పంపిణీ చేశామని చెప్పారు. దళారీ బెడద, పైరవీలకు ఆస్కారం లేకుండా అవినీతికి తావులేకుండా పట్టాదారు పాసు పుస్తకం కలిగి బ్యాంకు ఖాతాలతో వివరాలు నమోదు చేయించుకున్న ప్రతి రైతు ఖాతాలో సాయం జమ చేశామన్నారు.

సీఎందే ఘనత...

అన్నం పెట్టే రైతు అగ్రస్థానంలో ఉండాలని ప్రపంచలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్... రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టారని మంత్రి గుర్తు చేశారు. విపత్కర పరిస్థితుల్లో సైతం అన్నదాతలకు రైతుబంధు సాయం అందించిన ఘనత ముఖ్యమంత్రిదన్నారు. రైతుబంధు నిధులు పకడ్బందీగా రైతుల ఖాతాలకు చేరేందుకు నిరంతరం కృషి చేసిన వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది, ఎన్ఐసీ, ఆర్థిక, రెవిన్యూ ఉద్యోగులకు ధన్యవాదాలు తెలియజేశారు.

ఇదీ చూడండి: రైతు బంధు సాయం కింద రూ.7351.74 కోట్లు పంపిణీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.