ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాల మూలంగానే రాష్ట్ర వ్యవసాయ స్వరూపం మారిందని మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం నేడు అన్నపూర్ణగా మారిందని తెలిపారు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలోని కంచిరావుపల్లి, కంభల్లాపురం, శ్రీరంగాపురం, వెంకటాపూర్, గుమ్మడం, సూగూరు, జనం పల్లి, రంగాపూర్, షాగాపూర్లో రైతు వేదికలను ప్రారంభించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రైతు వేదికల నిర్మాణాలు చేపట్టారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. రాబోయే రోజుల్లో రైతువేదికలలో సేద్యం గురించి చర్చించుకోవాలన్నారు. రైతులకు మేలు జరగాలనే ఉద్దేశంతో రైతుబీమా, రైతుబంధు పథకాలను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారని తెలిపారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పప్పు దినుసులు, నూనె గింజల పంటలు , పత్తి, కంది పండించాలని కోరారు.
ఇదీ చదవండి: Cm Kcr Story: సీఎం కేసీఆర్ చెప్పిన కలియుగ రాక్షసుల కథ