రాష్ట్రంలో సరికొత్త సామాజిక మార్పుకు నాంది పలకడమే పట్టణ ప్రగతి కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని ఇందిరా కాలనీలో రెండో విడత పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, నాగర్కర్నూల్ ఎంపీ రాములు, కలెక్టర్ యాస్మిన్ బాషా ప్రారంభించారు.
పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛ పట్టణాలుగా రూపు దిద్దడం, అవినీతి రహిత, పారాదర్శకతతో సుపరిపాలన అందించడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అన్నారు. కలెక్టర్ యాస్మిన్ బాషా వార్డుల్లో కలియతిరుగుతూ.. మొక్కలను సంరంక్షించాలని ప్రజలకు అవగాహన కల్పించారు.