వనపర్తి జిల్లా ఖిల్లాగణపురం మండలం కర్ణెతండా సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని తుఫాన్ వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మోటార్‌సైకిల్‌పై ఉన్న తండ్రి, కుమారుడు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. కర్ణె తండాకు చెందిన పరమేశ్ నాయక్ తన ఇద్దరు కుమారులతో ఖిల్లా గణపురానికి వెళ్లి వస్తుండగా దుర్ఘటన చోటుచేసుకుంది. తుఫాన్ వాహనంలోని వారూ గాయపడ్డారు. క్షతగాత్రులను మహబూబ్‌నగర్‌లో ఆస్పత్రికి తరలించారు.
ఇవీ చూడండి: ఆటోలో 24 మంది... క్లాస్ తీసుకున్న పోలీసులు