వికారాబాద్ జిల్లా ధారూర్ మండలం నాగసముద్రంలో ఆఫ్రీన్ బేగం అనే మహిళ మృతి చెందింది. పెళ్లయిన రెండేళ్లకే వివాహిత మృతి చెందడం పట్ల మృతురాలి కుటుంబ సభ్యులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. నాగసముద్రం గ్రామానికి చెందిన అఖిల్‌కు, పుల్మామిడి గ్రామానికి చెందిన ఆఫ్రీనాబేగంకు రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లి జరిగిన నాటి నుంచి భర్త, అత్తమామలు, మరుదులు వేధించడం వల్లే తమ కూతురు చనిపోయిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. అఖిల్ కుటుంబమంతా కలిసి చంపేసి... గుండెపోటుతో మృతి చెందిందని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఆఫ్రీనాబేగం తల్లిదండ్రుల ఫిర్యాదుతో వికారాబాద్ డీఎస్పీ సంజీవరావ్ కేసును దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: పెళ్లై 48 గంటలే.. అంతలోనే వధువు మృత్యుఒడికి..!