వికారాబాద్ జిల్లా పరిగి కులకచర్లలోని తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్వో, వీఆర్ఏలు తమ వద్దనున్న రెవెన్యూ రికార్డులను... ఎమ్మార్వో అశోక్ కుమార్కు అందించారు. కొత్త రెవెన్యూ చట్టంలో భాగంగా... ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన మేరకు రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు అశోక్ కుమార్ తెలిపారు.
కొత్త రెవెన్యూ చట్టంపై ఇప్పటికే ముసాయిదా బిల్లు సిద్ధమైంది. మంత్రివర్గ సమావేశంలో బిల్లుకు ఆమోదముద్ర వేయనున్నారు. ఒకటి, రెండు రోజుల్లో బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు.
ఇదీ చూడండి: దేశం గర్వించే గొప్ప నేత.. ప్రణబ్ ముఖర్జీ: భట్టి విక్రమార్క