వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో లాక్డౌన్ అమలు ఎలా జరుగుతుందో తెలుసుకునేందుకు జిల్లా ఎస్పీ నారాయణ క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా 10 దాటిన తర్వాత ప్రజలు బయట తిరగడంపై అసహనం వ్యక్తం చేశారు. భౌతిక దూరం పాటిస్తూ... మాస్కులు ధరించి లాక్డౌన్ నిబంధనలను పాటించాలని సూచించారు.
ఉదయం 10 తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు ఇంటి నుంచి బయటకు రావొద్దని జిల్లా ఎస్పీ నారాయణ తెలిపారు. మాట వినకుండా వచ్చి.. పోలీసులతో వాగ్వాదానికి దిగితే లాఠీలతో బుద్ధి చెప్పాల్సి వస్తుందన్నారు. ఇలాగే చేస్తే కేసులు కూడా పెడతామని హెచ్చరించారు.
ఇవీ చదవండి: కరోనా కోలుకున్న వారిలోనూ.. బ్లాక్ ఫంగస్