ETV Bharat / state

వికారాబాద్​లో దారుణం... భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేసిన భర్త - murder

వికారాబాద్ మోతీబాగ్​లో దారుణం చోటుచేసుకుంది. భార్యపై అనుమానంతో ఓ భర్త అర్ధరాత్రి అతి క్రూరంగా ప్రవర్తించి భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేశాడు.

murder
author img

By

Published : Aug 5, 2019, 9:38 AM IST

భార్యపై అనుమానంతో ఓ భర్త అర్ధరాత్రి అతి కిరాతకంగా భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేసిన ఘటన వికారాబాద్​ మోతీబాగ్​లో కలకలం రేపింది. ఇనుప కడ్డీతో తలపై బాది హత్య చేశాడు. ఆ తర్వాత నిందితుడు స్థానిక పోలీస్​స్టేషన్​లో లొంగిపోయాడు.

హైదరాబాద్ లింగంపల్లికి చెందిన ప్రవీణ్ కుమార్, చాందిని ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నారు. కొంతకాలంగా వికారాబాద్​లో ప్రైవేటు ఉద్యోగాలు చేస్తూ నివసిస్తున్నారు. ఇటీవల భార్య చాందినిపై అనుమానం పెంచుకున్న ప్రవీణ్ కుమార్ తరుచూ గొడవలు పడుతుండేవాడు. నిన్న అర్ధరాత్రి ఇద్దరి మధ్య జరిగిన గొడవతో.... కోపోద్రిక్తుడైన ప్రవీణ్ కుమార్... ఇంట్లో ఉన్న ఇనుప కడ్డీతో భార్య చాందిని, కొడుకు అయాన్, కూతురు ఏంజిల్​ను తలపై బాది హత్య చేశాడు . అనంతరం వికారాబాద్ పోలీస్ స్టేషన్​లో లొంగిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని హత్య జరిగిన తీరును పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేసిన భర్త

ఇవీ చూడండి:మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఘోర ప్రమాదం, 13 మంది మృతి

Intro:TG--hyd--VKB--07--05--av--Mardar--av--TS10027

Body:మురళీకృష్ణ

Conclusion:వికారాబాద్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.