వికారాబాద్ మున్సిపాలిటీలో మొత్తం 34 వార్డులకు గాను 285 నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయని మున్సిపల్ కమిషనర్ భోగేశ్వర్లు తెలిపారు. తెరాస-115, కాంగ్రెస్-95, భాజపా-34, సీపీఎం-02, ఎంఐఎం-08,తెదేపా-07,స్వతంత్రులు-24 మంది నామపత్రాలు సమర్పించారు. శనివారం నామపత్రాలను పరిశీలించనున్నట్లు కమిషనర్ వెల్లడించారు.
నామపత్రాల దాఖలు సందర్భంగా వివిద పన్నుల ద్వారా 32,72,727 రూపాయల ఆదాయం వచ్చిందని కమిషనర్ పేర్కొన్నారు. 800 ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం చొప్పున 68 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. లెక్కింపు శ్రీ అనంతపద్మనాభ కళాశాల పీజీ బ్లాక్లో ఉంటుందని కమిషనర్ తెలిపారు.