వికారాబాద్ జిల్లాలో గత వారం రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని ప్రాజెక్టులు, నదులు, వాగులు నిండుకుండలా మారాయి. జిల్లాలోని కోటపల్లి, పరిగి లక్మాపూర్ జుంటుపల్లి, అల్లాపూర్ శివ సాగర్ ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండుకున్నాయి. ఆయా ప్రాజెక్టుల నుంచి భారీ ఎత్తున వరద నీరు కిందికి ప్రవహిస్తోంది.
నిండుకుండలా మారిన ప్రాజెక్టులను చూడటానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివెళ్తున్నారు. ఆయా ప్రాజెక్టుల వద్ద ప్రజలు ఉల్లాసంగా గడుపుతున్నారు.
ఇదీ చదవండి: నిండుకుండలా ప్రాజెక్టులు.. గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల