వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం రావులపల్లిలో ఏర్పాటు చేసిన తెలంగాణ-కర్ణాటక సరిహద్దు చెక్‌పోస్టును కలెక్టర్ పౌసమి బసు తనిఖీ చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చే వారిని చెక్‌పోస్టు వద్ద పరీక్షించి కరోనా లక్షణాలున్న వారిని క్వారంటైన్‌కు తరలించారని అధికారులను ఆదేశించారు.
ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న తెలంగాణ వాసులు, రాష్ట్రంలో చిక్కుకున్న ఇతర రాష్ట్రాల వలస కార్మికుల వివరాలను సమగ్రంగా పొందుపరచాలని సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా వైద్యాధికారి దశరథ్ ఉన్నారు.