వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని కొడంగల్, కోస్గి పురపాలికల్లో స్థానిక ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డితో కలిసి ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పర్యటించారు. ఈ సందర్భంగా కోస్గిలో కరోనా నేపథ్యంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం హుస్నాబాద్‌లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు ఆటోడ్రైవర్లకు నిత్యావసరాలు పంపిణీ చేశారు.
కరోనా వ్యాప్తిని నివారించేందుకు పోలీసులు, వైద్యులు తమ ప్రాణాలను పణంగా పెట్టి సేవలందిస్తుంటే.. కొందరు అనవసరంగా రోడ్లపైకి వస్తూ ఇబ్బందులు సృష్టిస్తున్నారని మంత్రి అసహనం వ్యక్తం చేశారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు నిరంతరం శ్రమిస్తున్న వైద్యులు, పోలీస్ సిబ్బందికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చూడండి : విద్యారంగానికి కరోనా- పరీక్షల నిర్వహణపై అయోమయం!