ఇవీ చూడండి: చెవులు, గొంతు కోసి దారుణంగా హత్య
సెప్టిక్ ట్యాంక్‌లో పడి ఇద్దరు చిన్నారుల మృతి - two children died in septic tank sump
వికారాబాద్ జిల్లా ఇబ్రహీంపూర్లో సెప్టిక్‌ట్యాంక్‌లో పడి ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడ్డారు.
సెప్టిక్ ట్యాంక్‌లో పడి ఇద్దరు చిన్నారుల మృతి
వికారాబాద్ జిల్లా పరిగి మండలం ఇబ్రహీంపూర్లో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు చిన్నారులు సెప్టిక్ ట్యాంక్ సంప్‌లో పడి మృతిచెందారు. ఇబ్రహీంపూర్‌కు చెందిన ఆరీఫ్ ఇవాళ సాయంత్రం దుబాయ్ ప్రయాణమవుతున్నాడు. అతన్ని చూసేందుకు సోదరి తన పిల్లలతో సహా ఇబ్రహీంపూర్ వచ్చింది. అంతలో ఇద్దరు చిన్నారులు ఆడుకునేందుకు బయటకువెళ్లారు. అలా ఆడుతూ... నూతనంగా నిర్మిస్తున్న సెప్టిక్ ట్యాంక్ సంప్‌లో పడి మరణించారు. ఉదయం ఆడుకునేందుకు బయటకు వెళ్లిన పిల్లలు ఎంతకీ రాకపోవడం వల్ల వెతకడం ప్రారంభించారు కుటుంబ సభ్యులు.. ఎట్టకేలకు సెప్టిక్ ట్యాంక్‌లో చిన్నారుల మృతదేహాలను గుర్తించారు. విగతజీవులుగా మారిన చిన్నారులను చూసి బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు. బాధితులను ఎమ్మెల్యే మహేష్ పరామర్శించారు.
ఇవీ చూడండి: చెవులు, గొంతు కోసి దారుణంగా హత్య
sample description