ETV Bharat / state

పాడితో ప్రయోజనం..అన్నదాతకు ప్రోత్సాహం - వికారాబాద్ జిల్లా

పశు సంవర్థక శాఖ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు రాయితీ పథకాలు వికారాబాద్ జిల్లాలో రైతులకు అందుబాటులోకి తెచ్చాయి. అర్హులైన వారు వాటిని అందిపుచ్చుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. పశువులకు బీమా చేయించుకుంటే అవి మరణిస్తే అన్నదాతలకు నష్టం కలగకుండా బీమా వర్తిస్తుంది.

పాడితో ప్రయోజనం..అన్నదాతకు ప్రోత్సాహం
author img

By

Published : Jul 5, 2019, 9:57 AM IST

వికారాబాద్ జిల్లాలో మొత్తం లక్షా 75 వేల పశువులున్నాయి. వీటిలో 94 వేలు ఆవు జాతి కాగా 81 వేల గేదెలు ఉన్నాయి. అయితే జిల్లాలో 3,308 పాలిచ్చే గేదెల పంపిణీకి అర్హులను గుర్తించారు. ఇందులో 1,187 గేదెలను పంపిణీ చేశారు. ఎస్సీ, ఎస్టీలకు 75 శాతం రాయితీతో పంపిణీ చేయగా బీసీలకు 50 శాతం రాయితీతో పంపిణీ చేస్తారు. గేదెల పొందేందుకు రైతులు కచ్చితంగా పాల డెయిరీలో సభ్యులై ఉండాలి. వారికే పాడిపశువులను మంజూరు చేస్తారు. అలాగే పాడి పశువులకు ఆరోగ్య బీమా కూడా వర్తిస్తుంది.

పశువులు చనిపోతే బీమా
ప్రమాదవశాత్తు గాని, ప్రకృతి వైపరీత్యాల వల్ల గాని లేదా వ్యాధి సోకి పశువులు చనిపోతే విలువను లెక్కించి, బీమా పరిహారం అందిస్తారు. దేశవాళీ, సంకరజాతి, ఆవులు, గేదెలు అన్నింటికీ ఈ బీమా వర్తిస్తుంది. పశువు చూడితో ఉన్నా పాలిస్తున్నా లేదా వట్టిపోయినా ఈ పథకం కింద రైతులకు పరిహారం అందుతుంది.

రాయితీపై పెరటి కోళ్లు
రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ఈ పథకాన్ని పొందేందుకు జిల్లాలో పెరటికోళ్ల యూనిట్లు 344 మంజూరు చేశారు. గ్రామీణ రైతు కుటుంబాలు, వ్యవసాయ కూలీ కుటుంబాలు అర్హమైనవి. ఈ పథకం ద్వారా ప్రభుత్వం రాయితీపై నాటు కోడి పిల్లలను అందిస్తోంది. ప్రతి లబ్ధిదారుడికి 25 కోడి పిల్లలను పూర్తి స్థాయి రాయితీపై ప్రభుత్వం అందజేస్తుంది. ఇందులో భాగంగా అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.

సిద్ధంగా విత్తనాలు
ప్రస్తుత వర్షాకాలంలో పశుగ్రాసం కొరత లేకుండా పశుగ్రాస విత్తనాలు 50 శాతం రాయితీపై ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. ఇందుకుగాను గొర్రెలు, మేకల పెంపకందార్ల కోసం పశువైద్య కేంద్రాల ద్వారా పశుగ్రాస విత్తనాలను పంపిణీకి సిద్ధంగా ఉంచారు. రైతులు తమకు కావాల్సిన పశుగ్రాస విత్తనాలు సమీప పశు వైద్యశాలలో పొందవచ్చు.

నివారణ టీకాలు
గాలికుంటు వ్యాధి నివారణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్నాయి. జిల్లాలో గత జూన్‌ 5 నుంచి 21 వరకు గ్రామాల్లోని పశువులకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలను వేశారు. అంతే కాకుండా గతనెల 18 నుంచి 25 వరకు నట్టల నివారణ మందునూ పంపిణీ చేశారు.

వైద్యసహాయం
జిల్లాలో 95 పశు వైద్యశాలలుండగా వీటిలో 38 డాక్టర్‌ స్థాయి పశు వైద్యశాలలు, 57 గ్రామీణ పశు వైద్యశాలలున్నాయి. ఇటీవల 14 భవనాలకు మరమ్మతులు చేపట్టారు. ప్రతి భవనానికి రూ.2 నుంచి రూ.3 లక్షల వ్యవయంతో పనులు పూర్తి చేశారు. మరో 15 భవనాలకు మరమ్మతుల కోసం నిధులు మంజూరు చేశారు. జిల్లాలో 19 మంది గోపాలమిత్ర కార్యకర్తలు పని చేస్తున్నారు. పశు వైద్యశాలలు లేని చోట గోపాలమిత్ర కార్యకర్తలు సేవలందిస్తారు. పశువులకు వైద్యమందించడానికి నియోజకవర్గానికి ఒకటి చొప్పున నాలుగు సంచార వాహనాలు అందుబాటులో ఉన్నాయి.

ఇదీ చూడండి : వయసు 17... కేసులు 15

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.