వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం నాగులపల్లి గ్రామంలోని పొలాల్లో ఎలుగు బంటి సంచరిస్తోంది. గ్రామానికి చెందిన బాయికాడి హనుమంతు అనే రైతు తన పొలంలో... ఎలుగుబంటి సంచరిస్తున్నట్లు గమనించి తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. విషయాన్ని సదరు రైతు... గ్రామస్థులకు తెలియజేశాడు. అనంతరం అందరూ కలిసి అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. గ్రామ పరిసరాల్లో భల్లూకం సంచరిస్తున్నట్లు గ్రామం మెుత్తం వ్యాపించడం వల్ల పొలాల్లోకి వెళ్లేందుకు రైతులు జంకుతున్నారు.
ఇవీ చూడండి : సూర్యుడికి గ్రహణం పట్టె... కన్న బిడ్డలను సజీవంగా పాతిపెట్టె!