ETV Bharat / state

Rolling on road: రోడ్డుపై దొర్లుతూ.. రహదారుల దుస్థితిపై వినూత్న నిరసన

Rolling on road: రహదారులు పాడై పోతే.. సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయడమో చేస్తుంటారు. లేదంటే సామాజిక మాధ్యమాల్లో విమర్శలు పోస్టు చేస్తూ.. వీడియోలు పెడతారు. తమ బాధ్యత తీరిపోయిందని ఫీలైపోతారు. ఆ తర్వాత అధికారులు స్పందించారా లేదా అనేది కూడా పట్టించుకోరు. కానీ ఈ వ్యక్తి మాత్రం రహదారుల దుస్థితిని చూసి తట్టుకోలేకపోయారు. ఇలాంటి రోడ్లపై వెళ్తే ఆ తర్వాత పరిణామాలు తీవ్రంగా ఉంటాయని భావించారు. అందుకే వినూత్న రీతిలో నిరసన తెలిపారు.

author img

By

Published : Dec 1, 2021, 1:10 PM IST

Tumbling on road in vikarabad
రోడ్డుపై దొర్లుతూ నిరసన

Rolling on road: రోడ్ల దుస్థితిపై ఓ వ్యక్తి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. దుమ్ము, ధూళితో అవస్థలు పడుతున్నామని.. స్థానికులు, వాహనదారుల సమస్యలను తెలియజేస్తూ రహదారిపై దొర్లుకుంటూ వెళ్లారు. రోడ్డు మీద రాళ్లు ఒంటికి గాయాలు చేస్తున్నా దిగమింగుకుంటూ తమ అవస్థలు అధికారుల కళ్లకు కట్టాలని ప్రయత్నించారు. వికారాబాద్‌ జిల్లా తాండూర్ మండలం ఎన్టీఆర్​ నగర్​ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Tandoor roads: అనంతారం గ్రామానికి చెందిన అమ్రేష్.. తాండూరు పురపాలక సంఘం పరిధిలోని ఎన్టీఆర్​ నగర్ కాలనీ రహదారిపై మోకాళ్ల మీద నడుస్తూ.. దొర్లుతూ నిరసన తెలిపారు. అపరిశుభ్ర వాతావరణం, రోడ్డుపై దుమ్ముతో అనారోగ్యం తలెత్తుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

మా కాలనీలో రహదారులు చాలా అధ్వానంగా మారాయి. అధికారులు, పాలకులు పట్టించుకోవడం లేదు. అందుకే ఈ విధంగా నిరసన తెలుపుతున్నా. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్లు బాగు చేయించాలి. అమ్రేష్​, అనంతారం గ్రామం

రహదారులు అధ్వానంగా మారి దుమ్ముతో అనారోగ్యం తలెత్తుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని అమ్రేష్​ వాపోయారు. అందుకే తాను ఈ నిరసనకు దిగినట్లు చెప్పుకొచ్చారు. అటుగా వెళ్తున్న వారంతా అమ్రేష్​కు మద్దతునిస్తూ.. ఇప్పటికైనా పాలకులకు కనువిప్పు కలగాలని అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించాలని విజ్ఞప్తి చేశారు. రహదారులు బాగు చేసి దుమ్ము, ధూళి నుంచి కాపాడాలని వేడుకున్నారు.

రహదారిపై దొర్లుతూ నిరసన తెలిపిన యువకుడు

ఇదీ చదవండి: Peddapalli RDO: బిల్లు కావాలా నాయనా.. అయితే లక్ష ఇవ్వాల్సిందే!!

groom Road accident: కాళ్ల పారాణి ఆరకముందే కాటికి.. నవవరుడిని కబళించిన మృత్యువు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.