లాక్డౌన్ సమయంలో అనవసరంగా రోడ్లపై ఎవరు తిరగవద్దని వికారాబాద్ ఎస్పీ నారాయణ కోరారు. జిల్లా కేంద్రంలో లాక్డౌన్ అమలవుతోన్న తీరును డీఎస్పీ సంజీవరావుతో కలిసి పరిశీలించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని సూచించారు.
నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. వైరస్ కట్టడికి అంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: మూడోదశ కరోనాను ఎదుర్కొనేందుకు సన్నద్ధమేనా : హైకోర్టు