వికారాబాద్ జిల్లా తాండూరులో నిర్వహించిన సంక్రాంతి ముగ్గుల పోటీలో మహిళలు, యువతులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీలో సంక్రాంతి పండుగ విశిష్టతను చాటిచెప్పే విధంగా అందమైన ముగ్గులు వేసి అందర్ని ఆకర్షించారు. గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల ఆటాపాటల వంటి ముగ్గులను తెలంగాణ ఖ్యాతిని ప్రతిబింబించేలా వేశారు.
ఈ పోటీల్లో గెలుపొందిన వారికి నగదుతో పాటు ప్రోత్సాహక బహుమతులను నిర్వాహకులు అందజేశారు. మొదటి బహుమతిగా రూ.2500, రెండో బహుమతిగా రూ.1500, మూడో బహుమతిగా వెయ్యి రూపాయల నగదును అందజేశారు.
ఇదీ చదవండి: యాదాద్రి ప్రధానార్చకుడికి జాతీయ విద్యారత్న అవార్డు