ETV Bharat / state

' గల్ఫ్ బాధితురాలు సమీనాకు అండగా ఉంటాం'

సమీనాను భాజపా వికారాబాద్ జిల్లా అధ్యక్షులు కరణం ప్రహ్లాద్ రావు సన్మానించారు. మహిళ కుటుంబానికి అండగా ఉంటామని పేర్కొన్నారు.

సమీనాను సన్మానించిన భాజపా వికారాబాద్ జిల్లా అధ్యక్షులు
author img

By

Published : Jul 25, 2019, 11:32 AM IST

Updated : Jul 25, 2019, 1:10 PM IST

సమీనాను భాజపా వికారాబాద్ జిల్లా అధ్యక్షులు కరణం ప్రహ్లాద్ రావు సన్మానించారు. మహిళ కుటుంబానికి అండగా ఉంటామని పేర్కొన్నారు. కేంద్రం సహకారం వల్లే... సమీనా భారత్​కి తిరిగి వచ్చిందని పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా పరిగి కులకచర్ల మండల కేంద్రంలో సమీనా నివసించేది. ఆరు నెలల క్రితం అనారోగ్యంతో ఉన్న కొడుకు ఆపరేషన్ డబ్బు కోసం తెలిసిన వారి సహకారంతో దుబాయ్​లో ఓ ఇంట్లో పనికి చేరింది.

ఆమె యజమానులు నెలలు గడిచిన జీతం ఇవ్వకపోగా, శారీరకంగా హింసిస్తున్నారని విలపించింది. తనను కాపాడమని సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. వెంటనే స్పందించిన ఈటీవీ భారత్ సోషల్ మీడియాలో పంపిన ఈ వీడియోని ప్రచారం చేసారు. ఆ కథనానికి స్పందించిన భాజపా వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు కరణం ప్రహ్లాద్ రావు, అతని స్నేహితుడు శ్రీనివాస్ చొరవతో మహిళను స్వస్థలానికి రప్పించారు. తన కష్టాలను అందరికి తెలిసేలా చేసిన మీడియాకు రుణపడి ఉంటానని పేర్కొన్నారు.

సమీనాను సన్మానించిన భాజపా వికారాబాద్ జిల్లా అధ్యక్షులు

ఇదీ చూడండి : గురుకుల విద్యార్థి మృతిపై దర్యాప్తునకు ఎన్​హెచ్​ఆర్సీ ఆదేశం

Last Updated : Jul 25, 2019, 1:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.