వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో అఖిలపక్ష నాయకులు సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ బిల్లులకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ చేశారు. బిల్లు ప్రవేశపెట్టినప్పటినుంచి దేశంలో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్లను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇవీ చూడండి: సాయం చేస్తే కుంభకోణం అనడం తగదు: కేసీఆర్