వికారాబాద్ జిల్లా పరిగిలో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. బస్సు కిందకి దూకి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బస్సు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడం వల్ల ప్రమాదం తప్పింది. పరిగిలో ఆర్టీసీ డిపోలో వెంకటయ్య డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఫీజు చెల్లించలేదని తన కుమార్తెను కళాశాల నుంచి బయటకు నెట్టివేశారని మనస్తాపానికి గురయ్యాడు. రెండు నెలలుగా వేతనాలు రాక జీవనం దుర్భరంగా మారిందని వాపోయాడు. కనీస అవసరాలకు సైతం ఇతరులపై ఆధారపడాల్సి వస్తోందని కన్నీటిపర్యంతం అయ్యారు.
ఇవీచూడండి: సమ్మెపై హైకోర్టులో సుదీర్ఘ వాదనలు... విచారణ రేపటికి వాయిదా...