ETV Bharat / state

ప్రభుత్వ స్థలాల్లోని అక్రమ కట్టడాల కూల్చివేత

ప్రభుత్వ భూముల్లో అక్రమ కట్టడాలను అధికారులు కూల్చేశారు. వికారాబాద్‌ జిల్లాలోని సర్పన్‌పల్లి ప్రాజెక్టు వద్ద నిర్మించిన నిర్మాణాలను తొలగించారు.

Revenue officials demolish illegal structures at Sarpanpalli project
సర్పన్‌పల్లి ప్రాజెక్టు వద్ద అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన రెవెన్యూ అధికారులు
author img

By

Published : Sep 15, 2021, 11:55 AM IST

వికారాబాద్‌ జిల్లా ధరూర్ మండలంలోని గ్రామీణ ప్రాంతమైన గోధుమగూడ సమీపంలోని సర్పన్‌పల్లి ప్రాజెక్టు వద్ద అనుమతులు లేకుండానే కొంతమంది ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలు చేపట్టారు. సమాచారం అందుకున్న తహసీల్దార్‌ రవీందర్​ నిర్మాణాలు చేపట్టిన ప్రాంతాన్ని పరిశీలించారు. అనుమతులు లేకుండా ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవని తహసీల్దార్‌ హెచ్చరించారు

గోధుమగూడ సమీపంలోని సర్వే నంబర్ 97లో 18.20 ఎకరాల సర్కారు స్థలంలో కొందరు వ్యవసాయ పనులు చేపడుతున్నారు. సర్పన్‌పల్లి ప్రాజెక్టు సమీపంలో ఉన్న ఎకరం పొలంలో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని గ్రామస్థులు సమాచారం ఇచ్చారని తహసీల్దార్‌ అన్నారు. సర్వే నంబర్ 97లో సుమారు 10 ఎకరాల్లో అక్రమంగా నిర్మిస్తున్న రిసార్ట్​ను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. కార్యక్రమంలో ఆర్‌ఐ మోహన్‌, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

కొంతకాలంగా రిసార్ట్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. రెవెన్యూ అధికారులు పలుమార్లు నోటీసులు జారీ చేసిన బేఖాతరు చేస్తు రాత్రివేళల్లో పనులు చేస్తున్నారు. జిల్లాలోని అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే అండదండలతో రిసార్ట్ పనులు సాగుతున్నట్లు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. రెవెన్యూ అధికారులు ఎన్నిసార్లు నోటీసులు జారీ చేసిన నిర్మాణం పనులు ఆపకపోవడంతో రెవెన్యూ అధికారులు ,గ్రామ సర్పంచ్ , ఉప సర్పంచ్ , గ్రామస్తులు సమక్షంలో జేసీబీలతో కూల్చీవేశారు.

ఇదీ చదవండి: crop: దిగుబడిలో 25 శాతానికి కేంద్రం అనుమతి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.