ETV Bharat / state

కడుపు కోతకు లాక్‌డౌన్‌

author img

By

Published : May 2, 2020, 9:18 AM IST

కరోనా నియంత్రణకు ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ గర్భిణుల కడుపు కోతలకు అడ్డుకట్టవేసింది. ప్రైవేటు ఆస్పత్రులు మూతపడడం.. ప్రభుత్వాసుపత్రులు మాత్రమే తెరచుకోవడంతో గర్భిణులు సర్కారు దవాఖానాలకే వెళ్లారు. అక్కడి వైద్యులు సాధారణ ప్రసవాలకే ప్రాధాన్యం ఇచ్చారు. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ప్రభుత్వ వైద్యులు, సిబ్బంది శస్త్ర చికిత్స చేసి ప్రసవాలు చేశారు. కడుపు కోత లేకపోవడం వల్ల ప్రసవమైనవారు ఒకటి, రెండు రోజుల్లోనే ఇంటికి క్షేమంగా వెళ్లారు. సాధారణ రోజుల్లో ప్రైవేటు వైద్యశాలల్లో 86 శాతం సిజేరియన్‌ కేసులు నమోదై.. కేవలం 14 శాతం సాధారణ ప్రసవాలు జరిగేవి.

pregnant women's Cesareans decreases
pregnant women's Cesareans decreases

కోవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో మార్చి 22 నుంచి వికారాబాద్​ జిల్లాలో లాక్‌డౌన్‌ అమలవుతోంది. అప్పటి నుంచి ప్రైవేటు ఆసుపత్రులు మూతపడ్డాయి. కేవలం ప్రభుత్వాసుపత్రులు, మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మాత్రమే ప్రసూతి సేవలందుతున్నాయి.

జిల్లాలో మొత్తం 25 ప్రభుత్వ ఆస్పత్రులున్నాయి. వీటిలో తాండూరులోని జిల్లా ఆస్పత్రి, వికారాబాద్‌, కొడంగల్‌, పరిగి, మర్పల్లిలో క్లస్టర్‌ ఆస్పత్రి, 20 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. తాండూరు, వికారాబాద్‌, పరిగి, కొడంగల్‌ పట్టణాల్లోని 25 ప్రైవేటు ఆస్పత్రులు, నర్సింగ్‌ హోమ్‌లు ఉన్నాయి.

ఏప్రిల్‌ 1 నుంచి 30వ తేదీ వరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో 748 ప్రసవ కేసులు నమోదు కాగా, 504 సాధారణ ప్రసవాలు చేశారు. మిగతా 244 మందికి రూపాయి ఖర్చు లేకుండా శస్త్ర చికిత్స నిర్వహించారు. అదే.. ప్రైవేటుకు ఆస్పత్రిలో ప్రసవానికి వెళితే శస్త్రచికిత్స పేరిట రూ.20-30వేల ఖర్చు అయ్యేది. శస్త్ర చికిత్స చేయించుకున్న మహిళలు బలహీనపడేవారు. ప్రస్తుతం ఇలాంటి సమస్యలు లేవని వైద్యులు, బాలింతలు పేర్కొంటున్నారు.

● తాండూరు జిల్లా ఆస్పత్రిలో ఏప్రిల్‌లో 436 కాన్పులు నమోదు కాగా, 248 మందికి సాధారణ ప్రసవాలే చేశారు. తప్పనిసరి పరిస్థితిల్లో 188 మందికి శస్త్రచికిత్సలు (సిజేరియన్‌) చేయాల్సి వచ్చింది.

● జిల్లాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో లాక్‌డౌన్‌కు ముందు 447 ప్రసవ కేసులు నమోదు కాగా, 370 మందికి సిజేరియన్‌ చేశారు. కేవలం 77 మందికి మాత్రమే సాధారణ ప్రసవాలు చేశారు.

● వికారాబాద్‌లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో ఏడాది వ్యవధిలో 186 ప్రసూతి కేసులు నమోదు కాగా, 185 సిజేరియన్లే. ఒక్కరికే సాధారణ ప్రసవం.

ఏప్రిల్‌లో నమోదైన ప్రసవాలు...

ఆస్పత్రి సాధారణ సిజేరియన్లు మొత్తం
తాండూరు జిల్లా ఆస్పత్రి 246 188 436
వికారాబాద్‌ ఏరియా ఆస్పత్రి 76 56 132
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో180 --180

For All Latest Updates

TAGGED:

eenadu
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.