ETV Bharat / state

డ్రోన్​ కెమెరాల పటిష్ఠ నిఘాలో వికారాబాద్ - పటిష్ఠ నిఘా

ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్​ను కట్టడి చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గత నెల 23 నుంచి లాక్​డౌన్​ను అమలు చేశాయి. వికారాబాద్ జిల్లాలో 21 పాజిటివ్​ కేసులు నమోదవడం వల్ల జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తం అయ్యింది. డ్రోన్​ కెమెరాల ద్వారా పటిష్ఠ నిఘాను ఏర్పాటు చేసింది.

author img

By

Published : Apr 13, 2020, 3:51 AM IST

వికారాబాద్​ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో దాదాపు 21 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో పోలీసు యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తమయ్యింది. వైరస్​ వ్యాప్తిని అరికట్టడానికి జిల్లాను నిర్బంధించారు. పాజిటివ్ కేసులు నమోదైన కాలనీలను పోలీసులు పూర్తిగా మూసివేశారు.

ప్రజలెవరూ బయటకు రాకుండా నిలువరించారు. అయినప్పటికీ కొందరు ఇళ్ల నుంచి బయటికి వస్తుండటం వల్ల పోలీసులు డ్రోన్​ కెమెరాల ద్వారా పటిష్ఠ నిఘాను ఏర్పాటు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని.. కేసు నమోదు చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరిస్తున్నారు.

ఇదీ చూడండి: కుమారుడి అంత్యక్రియలకు 2,000 కి.మీ ప్రయాణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.