వికారాబాద్‌లోని శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని 8 రోజలు పాటు మూసివేస్తున్నట్టు ఆలయ ఈఓ శేఖర్ గౌడ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆలయ అర్చకునికి కరోనా సోకడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు.
దేవస్థానాన్ని పూర్తి శానిటేషన్ చేసి మూసివేయనున్నట్టు వెల్లడించారు. ఎనమిది రోజుల తరువాత భక్తులకు ఆలయ దర్శనం ఉంటుందన్నారు.
ఇదీ చూడండి: సాగరహారం.. అద్భుత వరం.. పర్యాటకుల మణిహారం