వికారాబాద్ జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ కాంగ్రెస్ అభ్యర్థి సునీతా సంపత్ దాఖలు చేసిన నామినేషన్‌ను ఏకపక్షంగా తిరస్కరించడం పట్ల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. తాండూరు ఎమ్మెల్యే, వికారాబాద్ డీసీసీ అధ్యక్షుడు పైలెట్ రోహిత్ రెడ్డి, మాజీ మంత్రి ప్రసాద్ కుమార్, అభ్యర్థి సునీతా సంపత్ ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన నాగిరెడ్డి, జిల్లా పాలనాధికారి ద్వారా పూర్తి వివరాలు సేకరించి పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఒత్తిడి వల్లనే నామపత్రాలను తిరస్కరించారని రోహిత్ రెడ్డి ఆరోపించారు.
బంధుప్రీతితో స్థానిక ఎన్నికల అధికారి ఏకపక్షంగా వ్యవహరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఓటమి భయంతోనే తెరాస ఎన్నికల అధికారులపై ఒత్తిడి తీసుకొస్తోందని, తమ అభ్యర్థి నామ పత్రాలను ఆమోదించే వరకు న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు..
ఇవీ చూడండి : 'మోదీని ఆయన కాపలాదారులే 'చోర్' అంటారు'