One Person Died at Shiva Sagar Lake in Vikarabad : వరుస సెలవులు రావడంతో ఎంజాయ్ చేద్దామని వికారాబాద్‌లోని అనంతగిరి పర్యటనకు ఓ బ్యాచ్ వెళ్లింది. మరో పది నిమిషాల్లో చేరుకుంటామనేలోపు విషాదం జరిగింది. ఉదయాన్నే ప్రయాణం చేసినందున చుట్టూ పొగ మంచు ఉండడంతో ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న శివసాగర్ చెరువులో వారు వెళ్తున్న కారు దూసుకెళ్లింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో నలుగురు బయట పడగా, ఒకరు మృతి చెందాడు. మరణించిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి చెందిన యువకుడిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని వికారాబాద్ సీఐ శ్రీనివాస్ తెలిపారు.
వంతెనపై నుంచి కదులుతున్న రైలుపై పడ్డ కారు, ముగ్గురు మృతి
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వికారాబాద్ పట్టణంలో ఉన్న శివసాగర్ చెరువు(Shiv Sagar Pond Issue in Vikarabad) రోజు రోజుకు ప్రమాదకరంగా మారుతోంది. పర్యాటకంగా పేరుపొందిన అనంతగిరికి అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని కనీసం రవాణా సౌకర్యాలు లేకపోవడంతో ఈ ప్రదేశంలో పలు ప్రమాదాలు జరుగుతున్నాయి.
లైవ్ వీడియో- 3 బైక్‌లపైకి దూసుకెళ్లిన SUV
Shiva Sagar Pond Bridge Issue in Vikarabad : దూర ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులకు సరైన సౌకర్యాలు కల్పించడంలో జిల్లా యంత్రాంగం విఫలమయిందని స్థానికులు తెలుపుతున్నారు. సమావేశాల్లో అభివృద్ధి చేస్తామని తెలిపిన ఇప్పటివరకు ఎలాంటి పనులకు నోచుకోలేదని అన్నారు. ఇలా పట్టించుకోక పోవడం వల్లే నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ హైదరాబాద్ నుంచి తెల్లవారుజామున నాలుగు గంటలకు కారులో నలుగురు యువకులు, ఒక యువతి వికారాబాద్ వెళ్తున్నారు.
Car Accident at Shiva Sagar Lake : శివసాగర్ చెరువు దగ్గరకు వచ్చే సరికి పొగ మంచు ఎక్కువగా ఉన్నందున రోడ్డు పై నుంచి పక్కన ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది(Car Accident in Vikarabad). అందులో నలుగురు మోహన్, సాగర్, పూజిత, రఘు చెరువు నుంచి బయటకు వచ్చారు. వారితో పాటు వచ్చిన కారు డ్రైవర్ గురు శేఖర్ చెరువులో మునిగిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు గజ ఈతగాళ్లను రంగంలోకి దింపి యువకుడ్ని బయటకి తీశారు. అప్పటికే ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
కాలువలోకి దూసుకెళ్లిన కారు- ఐదుగురు మృతి, అంతా బంధువులే!
ఈ ఘటనలో మృతి చెందిన యువకుడు విశాఖపట్నానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నామని వికారాబాద్ సీఐ శ్రీనివాస్ పేర్కొన్నారు. గత 15 సంవత్సరాలుగా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదాలపై పలుమార్లు నాయకులకు, అధికారులకు చెప్పిన ప్రయోజనం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సరైన పరిష్కార మార్గం చూపించాలని విజ్ఞాప్తి చేశారు. లేనిపక్షంలో ఇవాళ జరిగిన మాదిరే మరిన్ని ప్రమాదాలు జరుగుతాయని హెచ్చరించారు.
దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా ఘోరం- రోడ్డు ప్రమాదంలో చిన్నారి సహా ఆరుగురు మృతి