దేశ పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తూ వికారాబాద్ జిల్లా తాండూరులో ముస్లిం మహిళలు ఆందోళన చేపట్టారు. రైల్వే స్టేషన్ సమీపంలోని మజీద్ నుంచి వినాయక, ఇందిరాగాంధీ, అంబేద్కర్ కూడలి మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు. జాతీయ పతాకంతోపాటు నల్ల జెండాలు పట్టుకుని యువతులు నిరసన తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న పౌరసత్వ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ దేశంలో పుట్టిన వారంతా ఇక్కడే మట్టిలో కలిసిపోతామంటూ నినాదాలు చేశారు. నిరసన ర్యాలీకి జిల్లా అదనపు ఎస్పీ ఆధ్వర్యంలో డీఎస్పీ లక్ష్మీనారాయణ బందోబస్తు పర్యవేక్షించారు.
ఇవీ చూడండి: తెలంగాణ నూతన సీఎస్‌గా సోమేశ్ కుమార్