తాండూరు పురపాలికతోపాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటామని తెరాస ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థుల పేర్లను సీఎం కేసీఆర్ సీల్డ్ కవర్లో పంపిస్తారని తెలిపారు. పార్టీలో ఎలాంటి వర్గ విభేదాలు లేవన్నారు. అందరం పార్టీ గెలుపు కోసం సమష్టిగా పని చేస్తున్నామని పేర్కొన్నారు.
ఇవీ చూడండి:'కేటీఆర్ ఆస్తులు 425 శాతం ఎలా పెరిగాయి'