ETV Bharat / state

తాండూరు ఆస్పత్రికి అంబులెన్సు విరాళమిచ్చిన ఎమ్మెల్సీ మహేందర్​ రెడ్డి - ఎమ్మెల్సీ మహేందర్​ రెడ్డి

తాండూరులోని జిల్లా స్థాయి ఆస్పత్రికి అధునాతన వసతులతో కూడిన అంబులెన్సును ఎమ్మెల్సీ మహేందర్​ రెడ్డి విరాళంగా ఇచ్చారు. రూ.20 లక్షలు విలువ చేసే ఏసీ అంబులెన్సును ఆయన ఆస్పత్రి అధికారులకు అందజేశారు.

MLC Mahedner Reddy Donated Ambulance to Thandur Hospital
తాండూరు ఆస్పత్రికి అంబులెన్సు విరాళమిచ్చిన ఎమ్మెల్సీ మహేందర్​ రెడ్డి
author img

By

Published : Oct 20, 2020, 10:06 PM IST

వికారాబాద్​ జిల్లా తాండూరు జిల్లా స్థాయి ఆస్పత్రికి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్​ రెడ్డి అధునాతన వసతులతో కూడిన అంబులెన్సును వితరణ చేశారు. రూ.10 లక్షలు విలువ చేసే అంబులెన్సులో అన్ని వసతులున్నాయని తెలిపారు.

తాండురు పరిసరాల్లోని గ్రామీణ ప్రాంత ప్రజలకు సత్వరమే వైద్య సేవలు అందేలా తన వంతు కృషిగా అంబులెన్సు అందిస్తున్నట్టు తెలిపారు. వైద్యులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి.. ప్రజలకు మంచి వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. అత్యవసర సమయంలో ప్రాణాలు నిలిపే అంబులెన్సుకు అందరూ దారివ్వాలని కోరారు.

ఇవీ చూడండి: అధైర్య పడొద్దు.. ప్రభుత్వం ఆదుకుంటుంది: మంత్రి కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.