ప్రజలు, రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు పనిచేస్తుందని ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించారు.
సీజనల్ వ్యాధులతో పాటు కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నందున ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. పట్టణాలలో పారిశుద్ధ్య పనులు చేపడుతున్నామని తెలిపారు. ఇంటి చుట్టూ పరిసరాలు, మురికి కాలువలను శుభ్రం చేసుకోవాలని సూచించారు. సీజనల్ వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ జగదీశ్వర్ రెడ్డి, ఎంపీపీ ముదప్ప దేశ్‌ముఖ్, వైస్ ఛైర్మన్ ఉషారాణి, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: అమ్మా.. నీ మనసు వెన్న...