వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని కొడంగల్, బొమ్మరాసుపేట, కోస్గి మండలాల్లోని ఆటో యూనియన్ కార్మికులు, ఆశా కార్యకర్తలు, జర్నలిస్టులకు ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. గ్రామాల్లో పేదలను ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాలని కోరారు. కొవిడ్-19 వ్వాప్తి చెందకుండా తీసుకోవాల్సిని జాగ్రత్తలను ప్రజలకు వివరించారు. వైరస్ వేగంగా విస్తరిస్తోన్న నేపథ్యంలో ప్రజలంతా.. మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. లాక్‌డౌన్‌లో స్వచ్ఛందంగా పాల్గొని... పోలీసులకు సహకరించాలని తెలిపారు.
ఇదీ చూచండి: ఆరోగ్య సిబ్బంది రక్షణకై కేంద్రం ప్రత్యేక ఆర్డినెన్స్