వికారాబాద్ జిల్లా పరిగి మండలం బర్కత్ పల్లిలో నిర్వహించిన రైతు అవగాహన సదస్సుకి ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి హాజరయ్యారు. రైతే రాజనే నినాదాన్ని నిజం చేసేందుకు సీఎం కేసీఆర్ కష్టపడుతున్నారని తెలిపారు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి తెలిపారు.
రైతుల సంక్షేమం కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ నియంత్రిత సాగు విధానాన్ని తీసుకొచ్చారని అన్నారు. అందుకోసం ప్రతి గ్రామంలో రైతులకు అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. పత్తి, కంది వంటి పంటలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సూచించారు. భూసార పరీక్షలు చేయించి ఏ పంటలకు ఏ భూమి అనువుగా ఉంటుందో తెలుసుకొని పంటలు వేయాలన్నారు. రైతులు పండించిన పత్తి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి భరోసా ఇచ్చారు.
ఇవీ చూడండి: గొర్రెకుంట బావి ఘటనలో వీడిన మిస్టరీ.. ప్రేమ వ్యవహారమే కారణమా?