ETV Bharat / state

ముఖ్యమంత్రి కేసీఆర్​ రైతు బాంధవుడు: మంత్రి సబిత - farmers in telangana

రైతును రాజును చేసేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. వికారాబాద్​ జిల్లా పరిగిలో నియంత్రిత సాగు విధానంపై అవగాహన సదస్సుకు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సీఎం కేసీఆర్​ రైతుల బాధలు తెలిసిన రైతు బాంధవుడని అన్నారు.

minister sabitha indrareddy Awareness seminar on controlled agricuture policy in vikarabad district
ముఖ్యమంత్రి కేసీఆర్​ రైతు బాంధవుడు: మంత్రి సబిత
author img

By

Published : Jun 3, 2020, 6:00 PM IST

వికారాబాద్ జిల్లా పరిగిలో నియంత్రిత సాగు విధానంపై అవగాహన సదస్సుకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని మంత్రి తెలిపారు. అందుకోసం వానకాలంలో రైతులు లాభసాటి పంటలు సాగుచేసుకోవాలని సూచించారు. సీఎం కేసీఆర్‌ రైతు బాంధవుడని చెప్పారు. రైతుల కష్టసుఖాలు తెలిసిన వ్యక్తి సీఎం కావడం రైతుల అదృష్టమని పేర్కొన్నారు.

తాను పండించిన పంటకు తానే ధర నిర్ణయించే స్థాయికి రైతు ఎదగాలన్నారు. రైతును రాజును చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్​ పర్సన్​ సునీత మహేందర్​రెడ్డి. ఎమ్మెల్యే మహేష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖపై సీఎం సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.