వికారాబాద్‌లో ఎక్కువ కరోనా కేసులు నమోదవుతున్నందున... ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు. కంటైన్‌మెంట్ ప్రాంతాల్లో లాక్‌డౌన్ అమలవుతున్న తీరును స్థానిక ఎమ్మెల్యే ఆనంద్‌తో కలిసి పరిశీలించారు.
నిత్యావసర వస్తువులు ఇంటికే అందిస్తామని... ఎవ్వరూ ఆందోళన పడొద్దని ప్రజలకు హామీ ఇచ్చారు. అనంతరం అధికారులతో కలిసి సమీక్షించారు. లాక్‌డౌన్ పకడ్బందీగా అమలయ్యేలా చూడాలని సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు.
ఇదీ చూడండి: లాక్‌డౌన్ వేళ వైభవంగా మాజీ సీఎం కుమారుడి వివాహం!