ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా నియంత్రణ కోసం రోజు 10 గంటల పాటు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి తెలిపారు. వికారాబాద్లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ సెంటర్ను ఆమె పరిశీలించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, జడ్పీ ఛైర్పర్సన్ సునీతారెడ్డి, ఎమ్మెల్యేలు ఆనంద్, కాలె యాదయ్యలతో సమావేశం నిర్వహించారు.
రాష్ట్రంలో కరోనాను అరికట్టడానికి ఎప్పటికప్పుడు తగు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ప్రధాని, ముఖ్యమంత్రి సూచించినట్లు 21 రోజుల పాటు అందరు తమ ఇళ్లలో ఉండి దేశానికి హానీ జరగకుండా చూడాలని కోరారు.
24 గంటలూ పనిచేస్తున్న అధికార యంత్రాంగానికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. వరి పంట కోతకు వస్తున్నందు ఇంటికి వచ్చి రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసేలా ప్రభుత్వం ఆలోచనలు చేస్తుందన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు ప్రజలు సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి: పారిశుద్ధ్య కార్మికులను... పట్టించుకునే నాథుడేడీ?