ETV Bharat / state

నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టెక్కిస్తాం: మంత్రి పువ్వాడ - minister puvvada in thandur vikarabad

కరోనా సంక్షోభ కాలాన్ని అధిగమిస్తూ నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టెక్కిస్తామని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్​ తెలిపారు. వికారాబాద్ జిల్లా తాండూర్​లో ఆర్టీసీకి చెందిన 29 దుకాణాల సముదాయాన్ని మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఆర్టీసీ ఆదాయం గాడిన పడ్డ తర్వాత రాష్ట్రంలో కొత్త డిపోలు, బస్ స్టేషన్లు, నూతన బస్సులు ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు.

minister puvvada inaugurated shops in rtc in vikarabad
టెండర్లు లేకుండానే పేదలకి దుకాణాలు: మంత్రి పువ్వాడ
author img

By

Published : Nov 10, 2020, 9:11 AM IST

కరోనా సంక్షోభంలో గత ఆరు నెలల గడ్డు కాలాన్ని అధిగమిస్తూ నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టెక్కిస్తామని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. వికారాబాద్ జిల్లా తాండూరులో రూ.80 లక్షలతో నిర్మించిన ఆర్టీసీకి చెందిన 29 దుకాణాల సముదాయాన్ని మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి సోమవారం ఆయన ప్రారంభించారు.

వైరస్​ భయంతో ప్రయాణికుల కొరత

నష్టాల్లో ఉన్న ఆర్టీసీని కాపాడుకోవడానికి బడ్జెట్​లో సీఎం కేసీఆర్​ రూ.1,000 కోట్లు కేటాయించారని గుర్తు చేశారు. ఉద్యోగులు, కార్మికులకు ప్రతి నెల రూ.100 కోట్లు వేతనాలు అందజేస్తున్నామని మంత్రి వెల్లడించారు. కరోనాకి ముందు కార్మికుల సమ్మె ప్రభావంతో ఆర్టీసీ తీవ్రంగా నష్టపోయిందని ఆయన పేర్కొన్నారు. వైరస్​ భయంతో ప్రయాణికులు బస్సులో తిరగకపోవడంతో సంస్థకు సరైన ఆదాయం రాలేదని దీంతో నష్టాలను చవిచూడాల్సి వచ్చిందని వెల్లడించారు.

టెండర్లు లేకుండానే

ఇప్పుడిప్పుడే ఆర్టీసీ ఆదాయం పెరుగుతుందని... రెండు మూడు నెలల్లో గాడిన పడుతుందని పువ్వాడ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఆదాయం గాడిలో పడ్డాక రాష్ట్రంలో నూతన బస్​ డిపో, బస్ స్టేషన్లు, కొత్త బస్సులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. టెండర్లు లేకుండానే బస్టాండ్లలో పీపీ విధానంతో దుకాణాలు ఏర్పాటు చేసి పేదలకు అందజేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: మరికొన్ని గంటల్లో తేలిపోనున్న దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.