ETV Bharat / state

FADANAVIS: 'సీఎం కేసీఆర్ ఎప్పుడైనా రైతుల వద్దకు వచ్చారా.?'

తెలంగాణలో పోరాటం ప్రారంభమైందని మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ స్పష్టం చేశారు. రైతుల సమస్యలు తెలుసుకునేందుకు బండి సంజయ్​ ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. వికారాబాద్​లో రచ్చబండ నిర్వహించిన ఈ ఇద్దరు నేతలు.. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

fadanavis
ఫడణవీస్​
author img

By

Published : Sep 4, 2021, 4:55 PM IST

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ ప్రజా సంగ్రామ యాత్ర తెలంగాణలో మార్పు తీసుకువస్తుందని మహరాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్​ అన్నారు. రైతుల సమస్యలు తెలుసుకునేందుకే సంజయ్​ పాదయాత్ర చేస్తున్నారని చెప్పారు. వికారాబాద్​ జిల్లా కేంద్రంలో రైతులతో బండి సంజయ్, ఫడణవీస్ రచ్చబండ నిర్వహించారు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బండి సంజయ్ యాత్ర మార్పు తీసుకువస్తుందని ఫడణవీస్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో పోరాటం ప్రారంభమైందని.. ప్రజలు సంజయ్​కు మద్దతుగా నిలవాలని కోరారు.

బండి సంజయ్​, ఫడణవీస్​ రచ్చబండ

రైతుల సమస్యలు తెలుసుకునేందుకే సంజయ్‌ పాదయాత్ర చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ ఎప్పుడైనా రైతుల వద్దకు వచ్చారా.? తెలంగాణలో పోరాటం ప్రారంభమైంది. ఈ ప్రాంత ప్రజలు సంజయ్‌కు మద్దతుగా నిలవాలి. -ఫడణవీస్​, మహారాష్ట్ర మాజీ సీఎం

రైతు బంధు పేరుతో సాగు పథకాలు ఎత్తేశారని బండి సంజయ్ ఆరోపించారు. ఎన్నికలు ఎక్కడుంటే అక్కడే రైతు బంధు అమలవుతోందని ఎద్దేవా చేశారు. సన్నవడ్లు పండించాలని చెప్పి రైతులను నట్టేట ముంచారని మండిపడ్డారు. రైతుల ఆత్మహత్యలపై కేసీఆర్​ సమాధానం చెప్పాలని సంజయ్‌ డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో భాజపా అధికారంలోకి వస్తే రైతుల సమస్యలు పరిష్కరిస్తామని సంజయ్ హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి: Huzurabad by election: హుజూరాబాద్​ ఉప ఎన్నికపై ఈసీ కీలక ప్రకటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.