ప్రస్తుతం టమాటాకు మార్కెట్‌లో రైతు విక్రయ ధర రూ.10 లోపే ఉంది. రైతు పండించిన పంటను మార్కెట్‌కు తేవడానికి... కోత ధర, రవాణా, కూలి, కమీషన్లు తదితర ఖర్చులు దాదాపుగా అంతే అవుతుండడంతో అన్నదాతలు విసిగిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం ఎత్‌రాజ్‌పల్లికి చెందిన రైతు మల్లారెడ్డి తన టమాటా పంటను పొలంలోనే వదిలేశారు. మార్కెట్‌కు తీసుకువెళితే ఖర్చులు కూడా రావడం లేదని వాపోతున్నారు.
'రూ.35 వేలు వెచ్చించి అర ఎకరంలో టమాటా సాగు చేశా. పంటను రెండుసార్లు తీసి మార్కెట్‌కు తరలిస్తే రూ.10 వేలు మాత్రమే వచ్చాయి. ఇప్పుడు ఖర్చులు కూడా రావడంలేదు. మార్కెట్‌కు తీసుకువెళ్లినా నష్టాలే వస్తున్నాయని కోయలేక పొలంలోనే వదిలేశా.' ---- రైతు మల్లారెడ్డి |
ఇదీ చదవండి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడే నోటిఫికేషన్