ETV Bharat / state

'బ్యాటరీ పేలి పూర్తిగా దగ్ధమైన సిమెంట్​ లారీ'

author img

By

Published : Sep 1, 2019, 4:08 PM IST

సిమెంట్​ లోడ్​తో వెళ్తొన్న లారీ... ఎదురుగా వస్తున్న మరో లారీని తప్పించబోయి కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాహనం బ్యాటరీ పేలి మంటలు చెలరేగి లారీ దగ్ధమైంది.

'బ్యాటరీ పేలి పూర్తిగా దగ్ధమైన సిమెంట్​ లారీ'

వికారాబాద్​ జిల్లా పరిగి మండలంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రూప్​ఖాన్​పేట గేటు సమీపంలో సిమెంట్​ లారీ పూర్తిగా దగ్ధమైంది. ఏపీ 15టీసీ 0378 నంబర్​ గల సిమెంట్​ లారీ సేడంలోని వాసవదత్త నుంచి సిమెంట్​ను హైదరాబాద్​కు తరలిస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. అతివేగంతో వెళ్తొన్న ఈ లారీ... ఎదురుగా వచ్చిన లారీని తప్పించబోయి.. పక్కనే ఉన్న కల్వర్టును ఢీకొట్టింది. లారీ బ్యాటరీ పేలి మంటలు చెలరేగి వాహనం మొత్తం వ్యాపించి దగ్ధమైంది. ఈ ప్రమాదం నుంచి డ్రైవర్​ సురక్షితంగా బయటపడ్డాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనా స్థలికి చేరుకుని మంటలార్పారు. అప్పటికే లారీ మొత్తం పూర్తిగా కాలిపోయింది.

ఇదీ చూడండి:అసోం ఎన్​ఆర్​సీపై దేశవ్యాప్తంగా అసమ్మతి స్వరాలు

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.