వికారాబాద్ జిల్లా కేంద్రంలో రాజీవ్‌నగర్ కాలనీ వాసులు రోడ్డుపై బైఠాయించారు. గురువారం రాత్రి జహీర్ ఖాన్ అనే యువకుడు డెంగీతో మరణించాడు. మున్సిపల్ సిబ్బంది నాలాలు, చెత్త తొలగించకపోవడం వల్లే డెంగీ బారినపడి చనిపోయాడని ఆరోపిస్తూ నిరసన తెలిపారు. మున్సిపల్ సిబ్బందికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనతో కిలోమీటర్ మేర వాహనాలు స్తంభించాయి. మున్సిపల్ సిబ్బంది వచ్చి చెత్తను తొలగించారు. రోజూ తొలగిస్తామని కమిషనర్ హామీ ఇచ్చిన తరువాత ఆందోళన విరమించారు.
ఇదీ చూడండి: డెంగీ లక్షణాలతో నాలుగోతరగతి చిన్నారి మృతి