వయో వృద్ధులకు అవసరమైన ఉచిత న్యాయ సేవా సహాయం కోసం ప్రత్యేక లీగల్ సర్వీసెస్ క్లినిక్‌ను ప్రారంభించామని వికారాబాద్ ఆర్డీఓ ఉపేందర్ రెడ్డి తెలిపారు. వాళ్లపై జరిగే దౌర్జన్యాలను అరికట్టేందుకు, సంరక్షణ, సంక్షేమం కోసం ఉచితంగా సేవలు అందిస్తామని వెల్లడించారు.
ఇతరులూ ఈ న్యాయ సేవల కొసం వికారాబాద్ ఆర్డీఓ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. పారా లీగల్ వాలంటీర్ రవి కుమార్... కౌన్సిలింగ్, న్యాయ సలహాలు అందిస్తారని తెలిపారు. ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలని సూచించారు.
ఇదీ చూడండి: 39 ఏళ్ల తర్వాత చదువులమ్మ ఒడిలో కలిసిన విద్యార్థులు