వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా కేటీఆర్ రోడ్‌షో నిర్వహించారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల నుంచి నీళ్లు తెచ్చి రైతుల కాళ్లు కడుగుతానన్నారు. రెండేళ్లలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి రంజిత్‌రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అభివృద్ధికి జోడెడ్లలా స్థానిక ఎమ్మెల్యేకు చేవెళ్ల ఎంపీని గెలిపించాలని సూచించారు.
ఇవీ చూడండి:'దిల్లీలో కూడా గులాబీ జెండా ఎగరాలి'