ETV Bharat / state

సర్పంచ్ బలవన్మరణం... కొత్తపల్లిలో విషాదం - మానసిక క్షోభతో సర్పంచ్ ఆత్మహత్య

స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి సర్పంచ్​గా గెలిచాడు. ప్రజలందరి మన్ననలతో పాలన సాగిస్తున్నాడు. ఇంతలోనే అతనికెందుకో జీవితంపై విరక్తి కలిగింది. ఎవరికీ చెప్పకుండానే ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదం కొత్తపల్లిలో చోటుచేసుకుంది.

kothappali-village-surpunch-committed-suicide-in-pudur-manadal-at-vikarabad-district
మానసిక క్షోభతో ఆత్మహత్య చేసుకున్న గ్రామ సర్పంచ్‌
author img

By

Published : Jun 24, 2020, 4:34 PM IST

వికారాబాద్‌ జిల్లా పూడురు మండలం కొత్తపల్లిలో విషాదం చోటుచేసుకుంది. మానసిక క్షోభతో ఆ గ్రామ సర్పంచ్‌ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని... మానసిక క్షోభ వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రాసిన సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తన వల్ల కుటుంబానికి... సమాజానికి ఎలాంటి ఉపయోగం లేదని లేఖలో పేర్కొన్నాడు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి... అనంతరం తెరాసలో చేరాడు. గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేద్దామనుకున్న కల తీరకుండానే మరణించడంతో గ్రామస్థులు కన్నీటి పర్యంతమయ్యారు.

ఇవీ చూడండి: పింఛన్ల కోతపై వివరణివ్వండి.. సర్కార్​కు హైకోర్టు నోటీసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.