ఇవీ చూడండి:భువనగిరిలో గెలిచేది నేనే
'రాహుల్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం' - mp
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రచారం ముమ్మరం చేశారు. పూడూరు, కుల్కచర్ల మండలాల్లో పర్యటిస్తూ కేసీఆర్ పాలనపై విమర్శలు చేశారు.
ప్రచారంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి
వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో చేవేళ్ల పార్లమెంటరీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి ఉద్యోగమని హామీ ఇచ్చిన కేసీఆర్... తన ఇంట్లో వారికి తప్పా ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలేదని విమర్శించారు. 16 ఎంపీ స్థానాలు గెలిచినా ముఖ్యమంత్రి చేసేదేమి లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని... అందరూ హస్తం గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి:భువనగిరిలో గెలిచేది నేనే
sample description