వచ్చే రెండు సంవత్సరాలలో కొడంగల్ రూపురేఖలు మారుస్తానని ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అన్నారు. బుధవారం కొడంగల్ పట్టణ కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులతో సమావేశమై... అన్ని వార్డుల్లో పర్యటించి ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొడంగల్‌కు కేటాయించిన 15 కోట్లతో పాటు పట్టణ ప్రగతిలో భాగంగా... వచ్చిన రెండున్నర కోట్లతో సీసీ రోడ్లు, మురుగు కాలువలు, అంతర్గత డ్రైనేజీ వ్యవస్థ పనులు వారం రోజుల్లోనే ప్రారంభించనున్నట్టు వెల్లడించారు.
గతంలో ఎన్నడూ చూడని అభివృద్ధి పనులను తాను చేసి చూపిస్తానని... కాలనీల్లోని సమస్యలు పరిష్కారమవుతాయని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులతో పాటు... క్రైస్తవ మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే: నిరంజన్‌రెడ్డి