వికారాబాద్ జిల్లా కొడంగల్లో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. మిషన్ భగీరథ, రైతుబంధు, రైతు బీమాతో తెలంగాణ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పాలనాధికారి అహేశ మస్రత్ ఖనమ్, ఆర్డీఓ వేణు మాధవరావు ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఇవీచూడండి: కరెంట్ షాక్ తగిలి కలకత్తా యువకుడు మృతి